వర్షాకాలం తర్వాత ఐపీఎల్.. ప్రేక్షకులు లేకుండానే !

కరోనా ఎఫెక్ట్ తో క్రీడా టోర్నీలన్ని రద్దయిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ మాత్రం నిరవధికంగా వాయిదా పడింది. ఒకవేళ ఐపీఎల్ రద్దయితో 4వేల కోట్ల వరకు నష్టం వాటిల్లుతుందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు.. ఐపీఎల్ ని వాయిదా వేయడానికి బీసీసీఐ ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం లాక్ డౌన్ ముగిశాక వర్షాకాలం మొదలవుతుంది. ఆ తర్వాతే ఐపీఎల్ గురించి ఆలోచించాలి. ప్రేక్షకులు లేకుండా ఐపీఎల్ నిర్వహించడం వల్ల జరిగే నష్టం ఎక్కువేం ఉండదని బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రి అన్నారు.

ఈ నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్ నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్టు అర్తమవుతోంది. మరోవైపు అక్టోబర్ 18 నుంచి జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ వాయిదా పడే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 28న జరగనున్న ఐసీసీ సమావేశంలో టీ20 వరల్డ్ కప్ పై నిర్ణయం తీసుకోనున్నారు.