వైరల్ : రానా ప్రీ-పెళ్లి సెలబ్రేషన్స్ పిక్స్
భల్లాలదేవుడు రానా దగ్గుబాటి ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. ‘ఆమె ఓకే చెప్పింది’ అంటూ.. ఇటీవలే ప్రేయసి మిహీకా బజాజ్ ని పరిచయం చేశాడు రానా. రానా పెళ్లి డిసెంబర్ లో ఉంటుందని సురేష్ బాబు ప్రకటించారు. అయితే బుధవారమే రానా-మిహికాల నిశ్చితార్థం అనే ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన సురేష్ బాబు ఇది నిశ్చితార్థ వేడుక కాదు. ఇవాళ ఇరు కుటుంబ సభ్యులు కూర్చొని నిశ్చితార్థం, పెళ్లి గురించి మాట్లాడుకుంటామని తెలిపారు.
రామా నాయుడు స్టూడియోస్ లో జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలని రానా సోషల్ మీడియాలో షేర్ చేశారు. సాంప్రదాయ దుస్తుల్లో రానా-మిహీకా జంట బాగుంది. రానా అయితే నేనే రాజు నేనే మంత్రి సినిమాలోని గెటప్ లో వైట్ అండ్ వైట్ లో కనిపించారు. మిహికా రెడ్ కలర్ సారీలో అందంగా ఉంది. ఇప్పుడీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.