అంఫన్.. కేంద్ర ప్యాకేజ్ రూ. 1500కోట్లు !
అంఫన్ తుపాన్ పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలని అతలాకుతలం చేసింది. విద్యుత్ మరియు టెలికాం మౌలిక సదుపాయాలను దెబ్బతీసింది. ఒక్క ఒడిశాలోనే సుమారు 44.8 లక్షల మంది ప్రజలను ప్రభావితం చేసినట్లు అంచనా వేశారు. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ అంఫన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఆ తర్వాత ఆయా రాష్ట్రాల సీఎంలతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రూ.1000 కోట్ల ప్యాకేజీ, ఒడిశాకు రూ.500 కోట్ల ఆర్థికసాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన మోడీ.. గాయపడినవారికి రూ.50 వేల ఎక్స్గ్రేషియా ఇస్తామని వెల్లడించారు. మొత్తంగా అంఫన్ తుఫాన్ ప్యాకేజీ కింద రెండు రాష్ట్రాలకి కలిపి రూ. 1500 ఆర్థిక సాయాన్నిప్రకటించారు ప్రధాని.