కార్పొరేటర్, ఆమె భర్తకి ఫైన్ వేయించిన కేటీఆర్

రూల్ ఈజ్ రూల్. రూల్ ఫర్ ఆల్ అన్నది మంత్రి కేటీఆర్ పాలసీ. అందుకే సొంత పార్టీ నేతలైనా, కార్పోరెటర్ అయినా.. రూల్స్ బ్రేక్ చేస్తే ఫైన్ వేయించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో శుక్రవారం కొత్తగా 45 బస్తీ దవాఖానాలను మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ సుల్తాన్‌నగర్‌, యాదగిరి నగర్‌లో బస్తీ దవాఖానాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

సుల్తాన్ నగర్‌లో బస్తీ దవాఖాన ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ఎర్రగడ్డ కార్పొరేటర్ షాహిన్ బేగంకు రూ. 20 వేల జరిమానా విధించాల్సిందిగా జీహెచ్ఎంసీ అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. అంతేకాకుండా కార్పొరేటర్ భర్త షరీఫ్ మాస్కు లేకుండా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆయనకు రూ.1000 జరిమానా విధించాలని కేటీఆర్‌ ఆదేశించారు.