ఫేస్ బుక్ లో కొత్త ఫీచర్.. భారతీయులకి మాత్రమే !

ఫేస్‌బుక్‌లో సరికొత్త సేఫ్టీ ఫీచర్‌ తీసుకొచ్చింది. వ్యక్తిగత వివరాలను దాచుకునేందుకు కొత్త ఫీచర్ ని తీసుకొచ్చారు. ఈ సరికొత్త ఫీచర్ తో ఫేస్‌బుక్‌లో మన ప్రొఫైల్‌ను లాక్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను ముఖ్యంగా భారతదేశంలోని మహిళల కోసమే అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

‘ప్రజలు ఎటువంటి భయం లేకుండా తమ భావాలను పంచుకునే విధంగా మా ప్లాట్‌ఫాంను సిద్ధంచేశాం. ఈ క్రమంలో వినియోగదారుల భద్రతే మా ప్రధాన లక్ష్యం. వారి ఇబ్బందులు, ముఖ్యంగా భారతీయ మహిళలకు ఎదురయ్యే ఇబ్బందులపై ప్రత్యేక శ్రద్ధపెట్టాం. ఈ సరికొత్త ఫీచర్ ద్వారా వీరి వ్యక్తిగత వివరాలు ఎవరికీ తెలియవు. తద్వారా మహిళల ప్రొఫైల్స్‌కు భద్రత పెరుగుతుంది’  ఫేస్‌బుక్ ఇండియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ ఆంఖీ దాస్ అన్నారు.