కరోనా ఎఫెక్ట్ : ఆర్ఆర్ఆర్ స్క్రిప్టులో స్వల్ప మార్పులు ?
కరోనా లాక్‌డౌన్ తో ఎక్కడి షూటింగ్‌లు అక్కడ ఆగిపోయాయి. ఈ జాబితాలో ‘ఆర్ఆర్‌ఆర్ : రౌద్రం రుధిరం రణం’ కూడా ఉంది. రామ్‌చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రమిది. లాక్‌డౌన్ కారణంగా దాదాపు రెండు నెలల కీలక సమయం వృథా అయ్యింది. ఈ నేపథ్యంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ స్క్రిప్టులో రాజమౌళి స్వల్ప మార్పులు చేసినట్టు సమాచారమ్.
భారీ యాక్షన్ సీక్వెన్స్, అవుట్ డోర్ షెడ్యూల్ సీన్స్ విషయంలో ఈ మార్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది. వీలైనంత వరకు తక్కువ మందితో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే వేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకునేలా రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎలాగూ ఇప్పటికే 80 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయింది కాబట్టి.. ఇప్పుడు చేసే మార్పులు కథపై పెద్దగా ప్రభావం చూపవని భావిస్తున్నట్లు సమాచారం. ఈ స్వల్ప మార్పులతో ఆర్ ఆర్ ఆర్ ని మరోసారి వాయిదా వేయకుండా వచ్చే యేడాది జనవరి 8న సినిమాని రిలీజ్ చేసే అవకాశం ఉంటుందని జక్కన్న ప్లాన్ లా కనిపిస్తోంది.