‘ఉప్పెన’ ఓటీటీ డీల్ ఫెయిల్


కరోనా లాక్‌డౌన్ తో షూటింగ్స్, థియేటర్స్ బంద్ అయ్యాయ్. షూటింగ్స్ అనుమతి కోసం ఇండస్ట్రీ ప్రముఖులు ప్రయత్నాలు చేస్తున్నారు. గురువారం మెగాస్టార్ చిరంజీవితో పాటు నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల శివ తదితరులు మంత్రి తలసాని శ్రీనివాస్ తో సమావేశం అయ్యారు. చిరంజీవి ఇంట్లో ఈ భేటీ జరిగింది. త్వరలోనే షూటింగ్స్ అనుమతి కోసం మంత్రి సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. అయితే థియేటర్స్ తిరిగి తెరచుకోవడంపై మాత్రం స్పష్టతలేదని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఇప్పట్లో థియేటర్స్ తెరచుకొనేలాలేవ్ అని చెబుతున్నారు. అందుకే రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలు ఓటీటీలో రిలీజ్ కోసం సమాలోచనలు చేస్తున్నాయి. ఉప్పెన సినిమా ఓటీటీ రిలీజ్ కోసం రూ. 14కోట్ల ఆఫర్ వచ్చినట్టు తెలిసిందే. అయితే ఉప్పెన బడ్జెట్ రూ. 18కోట్లు దాటిదంట. ఈ నేపథ్యంలో ఓటీటీ ఆఫర్ కి ఉప్పెన టీం ఓకే చెప్పలేదు. డీల్ ఫెయిల్ అయిందని చెబుతున్నారు.
ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్నారు. కృతి శెట్టి కథానాయిక. విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించారు.  దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఉప్పెన కరోనా ఎఫెక్ట్ తో వాయిదా పడింది.