ఐసీసీ ఛైర్మన్ గా గంగూలీ ?

సడెన్ సప్రైజ్ ఇవ్వడం బీసీసీఐ బాస్ సౌరభ్ గంగూలీకి అలావాటే. 2000లో ఆయన కెప్టెన్ అవ్వడం, గత యేడాది బీసీసీ బాస్ గా బాధ్యతలు చేపట్టడం అనూహ్యంగా జరిగినవే. ఇప్పుడు ఐసీసీ పెద్ద పదవికి గంగూలీ ఫేవరెట్ గా మారిపోయాడు. ఐసీసీ ఛైర్మన్ పదవికి అనూహ్యంగా రేసులోకి వచ్చాడు. అతణ్ని ఆ పదవిలో కూర్చోబెట్టడానికి మెజారిటీ క్రికెట్ దేశాల బోర్డులు సుముఖంగా ఉన్నట్లు సమాచారం.

దక్షిణాఫ్రికా క్రికెట్ డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ ఇప్పటికే దాదాకు తన మద్దతు ప్రకటించాడు. బీసీసీఐతో ఉన్న విభేదాల దృష్ట్యా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), తమ ఛైర్మన్ కొలిన్ గ్రేవ్స్ ఐసీసీ పదవిని ఆశిస్తున్న నేపథ్యంలో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) మాత్రమే గంగూలీని వ్యతిరేకించేందుకు ఆస్కారముంది. మిగతా బోర్డులకు దాదా విషయంలో ఏ అభ్యంతరం ఉండకపోవచ్చు. నాలుగేళ్లుగా ఐసీసీ ఛైర్మన్ పదవిలో ఉన్న శశాంక్ మనోహర్ పదవీకాలం జులైలో జరగబోయే ఐసీసీ వార్షిక సమావేశంతో ముగియబోతుండగా.. అందులోనే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ఈ రేసులో దాదా ముందున్నాడు.