నాగబాబు మరో వివాదాస్పద ట్విట్
దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసిన మహానుభావుల పేర్లు తప్ప మొహాలు గుర్తు రావడం లేదు. భావితరాలకు కరెన్సీ నోట్ల పై వారి ముఖ పరిచయం చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు మెగా బ్రదర్ నాగబాబు. ఈ నెల 19న నాథూరాం గాడ్సే జయంతి సందర్భంగా ఆయన గొప్ప దేశభక్తుడు అనే వీడియోని నాగబాబు షేర్ చేసిన సంగతి తెలిసింది. ఇది వివాదాస్పదం అయింది. కాంగ్రెస్ నేతలు నాగబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయనపై కేసులు కూడా పెట్టారు. ఆ వివాదం కొనసాగుతుండగానే తాజాగా మరోసారి సంచలన ట్విట్ చేశారు నాగబాబు.
“ఇండియన్ కరెన్సీ నోట్ల మీద సుభాష్ చంద్ర బోస్, అంబేద్కర్, భగత్ సింగ్, చంద్ర శేఖర్ ఆజాద్, లాల్ బహదూర్, పీవీ నరసింహారావు, అబ్దుల్ కలాం, సావర్కార్, వాజపేయ లాంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉంది. ఎందుకంటే? స్వతంత్ర భారత ఆవిర్భావానికి కృషి చేసిన మహానుభావులని జనం మర్చిపోకూడదని ఒక ఆశ. గాంధీగారు బ్రతికి ఉంటే ఆయన కూడా తనతో పాటు దేశానికి సేవ చేసిన దేశభక్తులని గౌరవించమని తప్పకుండా చెప్పేవారు. దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసిన మహానుభావుల పేర్లు తప్ప మొహాలు గుర్తు రావడం లేదు. భావితరాలకు కరెన్సీ నోట్ల పై వారి ముఖ పరిచయం చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది” అంటూ నాగబాబు ట్విట్ చేశారు
Indian కరెన్సీ నోట్ల మీద సుభాష్ చంద్ర బోస్,అంబేద్కర్, భగత్ సింగ్,చంద్ర శేఖర్ ఆజాద్,లాల్ బహదూర్ ,పీవీ నరసింహారావు,అబ్దుల్ కలాం,సావర్కార్,వాజపేయ లాంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉంది.ఎందుకంటే స్వతంత్ర భారత ఆవిర్భావానికి కృషి చేసిన మహానుభావులని జనము మర్చిపోకూడదని ఒక ఆశ.
— Naga Babu Konidela (@NagaBabuOffl) May 22, 2020
గాంధీ గారు బ్రతికి ఉంటే ఆయన కూడా తనతో పాటు దేశానికి సేవ చేసిన దేశభక్తులని గౌరవించమని తప్పకుండా చెప్పేవారు.దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసిన మహానుభావుల పేర్లు తప్ప మొహాలు గుర్తు రావడం లేదు.భావితరాలకు కరెన్సీ నోట్ల పై వారి ముఖ పరిచయం చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.
— Naga Babu Konidela (@NagaBabuOffl) May 22, 2020