సెట్లో లైటేస్తే మా కడుపు నిండిపోద్ది

సినీ పరిశ్రమని మురిపించారు సీఎం కేసీఆర్. జూన్ నుంచి సినిమా షూటింగ్స్ జరుపుకోవచ్చని తెలిపారు. కానీ లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ షూటింగ్స్ జరుపుకోవాలని సూచించారు. థియేటర్స్ అనుమతి ఇచ్చే విషయంపై కూడా ఆలోచిస్తామని.. రానున్న రోజుల్లో పరిస్థితులని బట్టి థియేటర్స్ ని అనుమతిని పరిశీలిస్తామని తెలిపారు.

షూటింగ్స్ అనుమతి ఇవ్వడంతో చిత్రపరిశ్రమ మురిసింది. ఆనందంలో సీఎం కేసీఆర్ కి కృతజ్ఝతలు తెలుపుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదిక సినీ పరిశ్రమ తరుపున సీఎం కేసీఆర్ కి కృతజ్ఝతలు తెలిపారు. ప్రముఖ గేయ రచయిత భాస్కర భట్ల సీఎం కేసీఆర్ కి ట్విట్టర్ వేదికగా కృతజ్ఝతలు తెలిపారు.

‘తిoడున్నా లేకున్నా మాకేనాడూ ప్రాబ్లెమ్ కాదే
సెట్లో లైటేస్తే మా కడుపు నిండిపోద్దే జూన్ నుంచి సినిమా షూటింగులకి అనుమతిచ్చిన కేసీయార్ గారికి , అందుకు కృషి చేసిన మెగాస్టార్ చిరంజీవి గారికీ లక్షలాది సినీకార్మికుల తరఫున ధన్యవాదాలు” అని ట్విట్ చేశారు.