త్రివిక్రమ్’తో బన్నీ నాల్గోసారి !

అల్లు అర్జున్-త్రివిక్రమ్ లది హిట్ కాంబో. వీరి కాంబోలో ఇప్పటికే హ్యాట్రిక్ చిత్రాలొచ్చాయ్. జులాయ్, సన్నాఫ్ సత్యమూర్తి, అల.. వైకుంఠపురంలో. దేనికదే ప్రత్యేకమైనవి. ఈ యేడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన అల.. బన్నీ కెరీర్ లోనే బెస్ట్ చిత్రంగా నిలిచింది. టన్నుల కొద్దీ రికార్డు సృష్టించింది. ఈ ఫ్లోలో త్రివిక్రమ్ తో మరో సినిమా చేసేందుకు బన్నీ రెడీ అంటున్నారు.

అసలు విషయం ఏంటంటే ? కరోనా లాక్ డౌన్ తో టాలీవుడ్ షెడ్యూల్ మొత్తం మారనుంది. ఏ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది ? ఎప్పుడు రిలీజ్ అవుతుంది ?? అన్నది సస్పెన్స్ గా మారింది. వాస్తవానికి త్రివిక్రమ్ తన తదుపరి సినిమాని ఎన్టీఆర్ తో చేయాల్సి ఉంది. అయితే అంతకంటే ముందు తారక్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని పూర్తి చేయాల్సింది. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఎప్పుడు పూర్తవ్వనుంది ? అనేది క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో ఈలోగా త్రివిక్రమ్ తో మరో సినిమా చేసేందుకు బన్నీ రెడీ అన్నారట. 

అయితే ‘పుష్ప’ సినిమాని పక్కన పెట్టేసి త్రివిక్రమ్ తో నాల్గోసారి అంటారా ? లేక.. పుష్ప తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు బన్నీ రెడీగా ఉన్నారా ?? అన్నది తెలియాల్సి ఉంది. ఇక త్రివిక్రమ్ కోసం ఓ నలుగురు స్టార్ హీరోలు ఎప్పుడంటే అప్పుడు రెడీగా ఉన్నారు. తారక్, బన్నీ, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ లు త్రివిక్రమ్ కి ఆల్ వేస్ వెల్ కమ్ చెప్పేందుకు రెడీగా ఉన్నారు. అయితే కరోనా ఎఫెక్ట్ తో ఎవరు ఎప్పుడు ఎవరితో సినిమాలు చేయబోతున్నారన్నది సస్పెన్స్ గా మారింది.