కేటీఆర్’ని ఢీకొననున్న పవన్
ఏపీలో సీఎం జగన్ ని ఢీకొనేందుకు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరైనోడని భాజాపా భావించింది. ఆయనతో చేతులు కలిపింది. ఏపీలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు కలిసి పనిచేయాలని నిర్ణయించింది. ఇందుకోసం కార్యచరణని రెడీ చేసే టైంలో కరోనా వచ్చిపడింది. లేదంటే ఇప్పటికే భాజాపా-జనసేనల ఉమ్మడి యాక్షన్ ప్లాన్ రెడీ అయి ఉండేది. ఇప్పుడు తెలంగాణ భాజాపా కూడా పవన్ నే నమ్ముకుంటోంది. సోమవారం తెలంగాణ భాజాపా అధ్యక్షుడు బండి సంజయ్ పవన్ కల్యాణ్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సంబంధించి వివరాలేవీ బయటికి రాలేదు. కానీ తెలంగాణ భాజాపా కూడా పవన్ ని వాడుకోవాలని డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది.
వాస్తవానికి తెలంగాణలో భాజాపాకి పవన్ సపోర్ట్ అవసరం లేదు. కానీ రాబోయే జీహెచ్ ఎంసీ ఎన్నికల వరకు మాత్రం పవన్ తో పని ఉంది. గ్రేటర్ లో భాజాపాకు బలం ఉంది. ఆ బలం మరింతగా పెరగాలంటే పవన్ సపోర్ట్ అవసరం భావించి ఉంటుంది. అందుకే కొత్త భాజాపా అధ్యక్షుడు బండి సంజన్ వచ్చి పవన్ కలవడం జరిగింది. ఈ సీన్ తో సీఎం కేసీఆర్ తో పవన్ ఢీ కొనబోతున్నాడనే ప్రచారం జరిగింది. వాస్తవానికి గ్రేటర్ బాధ్యతలని మంత్రి కేటీఆర్ తీసుకొన్నారు. గత జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో గ్రేటర్ బాధ్యతలని పవన్ మోసారు. రాబోయే జీహెచ్ ఎంసీ ఎన్నికల్లోనూ కేటీఆర్ దే బాధ్యత. ఈ నేపథ్యంలో పవన్ కేటీఆర్ ని ఢీకొనబోతున్నారు. ఆ విషయం త్వరలో జరగనున్న గ్రేటర్ ఎన్నికలతో అర్థం కానుంది.