షూటింగ్స్ ప్రారంభం మరింత ఆలస్యం ?

సినిమా షూటింగ్ లకి సీఎం కేసీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. జూన్ నుంచి రెగ్యులర్ పనులు చేసుకోమని, మరీ భారీ షూటింగ్ ల సంగతి ఆలోచిస్తామని కేసీఆర్ మాటిచ్చారు. ఇంతకీ షూటింగ్ లు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయి అంటే.. ? దానికి ఇంకో 20 రోజుల సమయం పట్టే ఛాన్స్ ఉంది. జూన్ 15 నుంచి షూటింగ్స్ మొదలయ్యే ఛాన్స్ ఉందని సమాచారమ్.

మరీ.. సినిమాల రిలీజ్ ఎప్పటి నుంచి అంటే.. ? అక్టోబర్ లేదా నవంబర్ పట్టొచ్చని చెబుతున్నారు. థియేటర్స్ తెరచినా.. ఒకప్పటి జోష్ కనబడకపోవచ్చు. అప్పటి రేట్లు ఇప్పుడు పెట్టేందుకు డిస్ట్రిబ్యూటర్స్ ఆసక్తిక్ చూపకపోవచ్చు. అసలు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్లు ఇప్పడు ఏ రేట్లు చెబుతారు. పాత కమిట్ మెంట్లు వుంటాయా? అసలు నిర్మాతలు అంతా కలిసి డిస్ట్రిబ్యూటర్ల విషయంలో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి?  ఇలాంటి చర్చలు ఇప్పుడు జరుగుతున్నాయి. మొత్తానికి.. కరోనా సినీ పరిశ్రమని చావు దెబ్బ కొట్టింది.