తారక్-త్రివిక్రమ్ మధ్యలోకి వెంకీ !

ఈ యేడాది ‘అల.. వైకుంఠపురంలో’తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు త్రివిక్రమ్. ఆయన తదుపరి సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఉండనుంది. అయితే ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తయితేనే తారక్ ఫ్రీ అవుతాడు. త్రివిక్రమ్ సినిమా చేస్తారు. అప్పటి వరకు త్రివిక్రమ్ వెయిట్ చేయాల్సిందే. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ తిరిగి ఎప్పుడు మొదలవుతుంది. ఎప్పుడు పూర్తవుతుంది అన్నది క్లారిటీ లేని విషయం. ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తికావడానికి ఈ యేడాది ఆఖరు అవుతుందని అంచనా వేస్తున్నారు.

ఈలోగా త్రివిక్రమ్ విక్టరీ వెంకటేష్ తో ఓ సినిమా తీసేయాలనే ప్లాన్ లో ఉన్నట్టు సమాచారమ్. అలాగని వెంకీ ఏం ఖాళీగా లేరు. ప్రస్తుతం ‘నారప్ప’ చేస్తున్నారు. అది పూర్తికాగానే ఎఫ్ 2 సీక్వెల్ చేయాల్సి ఉంది. ఈ రెండింటికి అడ్జెస్ట్ చేసుకొని వెంకీ త్రివిక్రమ్ సినిమా చేస్తారా ? అన్నది చూడాలి. మరోవైపు త్రివిక్రమ్ ని బన్నీ ఊరిస్తున్నారు. ఆయనతో మరో సినిమా చేసేందుకు రెడీ అంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మరింత ఆలస్యం కానుందనే విషయంలో క్లారిటీ వస్తే.. ఈలోగా వెంకీ లేదా బన్నీతో తివిక్రమ్ ఓ సినిమా చేసే ఛాన్స్ ఉందని సినీ వర్గాల సమాచారమ్.