యాదాద్రిలో మరో వివాదం
తెలంగాణ తిరుపతి యాదాద్రి లక్ష్మీ నరసింహా దేవాలయ పునర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గర్భాలయంలోకి ఎవరిని అనుమతించడం లేదు. అయితే నిబంధనలకి విరుద్ధంగా స్వామి గర్భాలయంలోకి ఆర్‌అండ్‌బీ అధికారులు, ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వెళ్లడం వివాదాస్పదంగా మారింది. ఆలయ విస్తరణ పనుల పరిశీలనకు వచ్చిన ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ గణపతిరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామకృష్ణారావు, ఇతర అధికారులు గర్భాలయంలోకి ప్రవేశించారు. గర్భాలయంలోకి ప్రవేశం లేదుగా.. ఎలా వెళ్లారని ప్రశ్నించగా నిర్మాణ పనుల పరిశీలనలో భాగంగానే గర్భాలయంలోకి వెళ్లినట్లు అధికారులు చెప్పారు. అయితే గర్భాలయంలో ఎలాంటి నిర్మాణ పనులు చేయడం లేదని అందరికీ తెలిసిందే.