ఐశ్వర్య కుటుంబంలో ముగ్గురు మృతి
ఐశ్వర్య రాజేశ్.. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరోయిన్. అయితే ఆ స్థాయికి రావడానికి ఆమె ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కోవలసి వచ్చింది. తాజాగా ఆమె TedX వేదికగా తన వ్యక్తిగత జీవితం గురించి పంచుకున్నారు. నాకు 8 ఏళ్లు ఉండగా నా తండ్రి చనిపోయారు. మా అమ్మే అంతా చూసుకునేది. మేం నలుగురు సంతానం. నాకు 13 ఏళ్లు ఉండగా.. మా పెద్దన్న రాఘవేంద్ర చనిపోయారు. మరో రెండేళ్లలో మరో సోదరుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. నేను 11వ తరగతి నుంచే ఉద్యోగం చేశా.
చెన్నైలో ఒక సూపర్ మార్కెట్ లో ఓ చాక్లెట్ కంపెనీ ప్రమోషనల్ ఈవెంట్ లో భాగంగా సేల్స్ గర్ల్ గా పనిచేశా. చదువుకుంటూనే అనేక పనులు చేశా. అమ్మకు సాయంగా ఉన్నా. ఆపై టీవీ సీరియల్ లో నటించడం మొదలుపెట్టా. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో నా రంగు, నా లుక్స్, నా శరీరాకృతి, నా డ్రస్సింగ్.. గురించి విమర్శించేవారు, ఎగతాలి చేసేవారు. నీ దగ్గర హీరోయిన్ మెటీరియల్ లేదు అని ఓ నిర్మాత అన్నాడు. లైంగిక వేధింపులు కూడా ఎదురయ్యాయి. అయితే ‘కాకా ముట్టై’ నా జీవితాన్ని మార్చేసింది. అందులో ఇద్దరు పిల్లలకు అమ్మగా నటించా. ‘కన్నా’ సినిమాలో క్రికెటర్ గా నటించా.. పెద్ద హిట్ అందుకుంది. జీవితం మారిపోయింది అని చెప్పుకొచ్చింది.