భయపెడుతున్న ఆర్జీవీ ‘కరోనా ట్రైలర్’

వాస్తవిక ఘటనలు, అంశాలతో సినిమాలు తీయడంలో రామ్ గోపాల్ వర్మ దిట్ట. ఇప్పుడు వర్మ ‘కరోనా వైరస్’ పై సినిమా మొదలెట్టారు. టైటిల్ కూడా అదే. కరోనా వైరస్ నేపథ్యంలో ఓ ఫ్యామిలీ కథ.

ఎప్పటి లాగే పెర్ ఫెక్ట్ గా నటులను ఎంచుకున్నారు. తనదైన టేకింగ్, తనదైన ఫ్రేమింగ్ అన్నీ మామూలే. నాలుగు నిమషాల నిడివితో కూడిన ఈ ట్రయిలర్ లో సిన్మా నేపథ్యం క్లారిటీగా చెప్పేసారు. ఆర్జీవీ కరోనా వైరస్ ట్రైలర్ ని చూస్తే.. భయమేస్తోంది.