ఉద్యోగులకి గుడ్ న్యూస్.. ఈ నెల నో కటింగ్స్ !
తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకి గుడ్ న్యూస్. వారికి మే నెల పూర్తి వేతనం అందనుంది. కరోనా ఎఫెక్ట్ తో మార్చి, ఏప్రిల్ నెలల జీతాల్లో ప్రభుత్వం కోత విధించిన సంగతి తెలిసిందే. వైద్యులు, స్వచ్చ కార్మికులు, పోలీసులకు మాత్రమే పూర్తి వేతనం అందించింది. అయితే మే నెల మాత్రం ప్రభుత్వ ఉద్యోగులకి పూర్తి వేతనం ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుసింది.
బుధవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. లాక్‌డౌన్ పొడిగింపుపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంనే.. ప్రభుత్వ ఉద్యోగులకు మే నెల పూర్తిస్థాయి జీతాల చెల్లింపునకు సీఎం సూచనప్రాయంగా ఆమోదం తెలిపినట్టు సమాచారం. ఇక హైకోర్టు తీర్పు నేపథ్యంలో పెన్షనర్లకు కూడా కోతల్లేకుండా మొత్తం చెల్లించే యోచనలో సీఎం ఉన్నట్టు తెలిసింది.
ఇక ఈ నెల 31 తర్వాత కూడా తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగించేందుకు సీఎం కేసీఆర్ మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. అయితే లాక్‌డౌన్ కేవలం జీహెచ్ ఎంసీకి పరిమితం చేస్తారా ? లేక కంటోన్మెంట్ లలో మాత్రమే లాక్‌డౌన్ ని పొడగిస్తారా ?? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఇక కేంద్రం మాత్రం మరో రెండువారాల పాటు లాక్‌డౌన్ పొడిగించేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.