గొర్రెకుంట బావి ఘటన : 9మందిని ఇలా చంపాడు

వరంగల్ గొర్రెకుంట బావి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయ్. పోలీసుల విచారణలో నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్ హత్యల పూర్తి వివరాలు తెలిపారు. ఒక్కడే పక్కా ప్లానింగ్ లో 9మందిని హతమార్చాడు. భోజనంలో నిద్రమాత్రలు కలపడంతో తొమ్మిది మంది గాఢ నిద్రలోకి జారుకున్నారు.

అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో మొదట మక్సూద్ భార్య నిషా ఆలంను బావిలో పడేశాడు. తర్వాత వరుసగా బుస్రా, మూడేళ్ల చిన్నారి బబ్లూ, సోహెల్, షాబాజ్, మక్సూద్, షకీల్, శ్యాంలను తోసేసి చివరగా శ్రీరాంను బావిలో పడేశానని సంజయ్ పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. అయితే పోలీసులు బావి నుంచి శవాలని వెలికితీస్తున్న సమయంలో సంజయ్ అక్కడే ఉన్నారు. పోలీసులకి కూడా ఎలాంటి తనపై ఎలాంటి అనుమానం లేదు. ఎలాంటి ఆధారాల్లేవనే ధీమాతో తిరిగాడు.

సీసీ టీవీ ఫుటేజీలు చూసి, రఫికా పిల్లలతో మాట్లాడిన పోలీసులు సంజయ్ ను లోతుగా విచారించగా హత్యలు చేసినట్టు అంగీకరించాడు. ఇక నిందితుడు సంజయ్ పై గీసుకొండ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చారు. అతడికి కోర్టు వచ్చే నెల 8 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.