చైనా కడుపుమంటకు కారణం ఇదే !

భారత్-చైనా సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నారు. ఇరు దేశాలు సైన్యాన్ని మోహరించడంతో యుద్ధ వాతావరణం నెలకొంది.  సరిహద్దుల్లో ప్రశాంతతకు భంగం కలిగించేలా వేల సంఖ్యలో సైన్యాన్ని తరలించింది. చైనాకు దీటుగా మన సైన్యం కూడా అక్కడ బలగాలను మోహరించింది. ఇప్పుడు ఇరు దేశాల సైనికులు ఢీ అంటే ఢీ అనే రీతిలో ఎదురెదురుగా నిలబడ్డారు. ఇంతకీ భారత్ పై చైనాకు అక్కసు ఎందుకంటే ?

గత కొన్నేళ్లలో చైనాకు దీటుగా భారత్ కూడా సరిహద్దు ప్రాంతంలో రోడ్లు, చిన్నపాటి వైమానిక స్థావరాలు, ఇతర మౌలిక వసతులను అభివృద్ధి చేసుకుంటోంది. మొత్తం మీద 3,346 కిలోమీటర్ల పొడవైన 61 సరిహద్దు రోడ్లను నిర్మిస్తోంది. దీనివల్ల ఎల్ ఏసీ వద్దకు సులువుగా బలగాలను చేరవేయడానికి, చైనా దురుసుతనానికి సకాలంలో అడ్డుకట్ట వేయడానికి భారత్ కు వీలవుతోంది. ఇదే పొరుగు దేశానికి కంటగింపుగా మారినట్టు రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

చైనాల నడుమ సరిహద్దు వివాదం.. 3,488 కిలోమీటర్ల వాస్తవాధీన రేఖ (ఎల్ ఏసీ) పొడవునా విస్తరించి ఉంది. అరుణాచల్ తనదేనని చైనా వాదిస్తోంది. ఇరు దేశాల మధ్య 1962లో యుద్ధం జరిగింది. ఆ తర్వాత సరిహద్దు వివాదం పరిష్కారమయ్యే వరకూ అక్కడ శాంతిని కాపాడాలని ఇరు దేశాలూ నిర్ణయించాయి. అందువల్ల గత కొన్ని దశాబ్దాల్లో అక్కడ ఒక్క తూటా కూడా పేలలేదు. ఎల్ ఏసీకి సంబంధించి తమ వైఖరికి అనుగుణంగా ఇరుపక్షాలు గస్తీ నిర్వహిస్తుంటాయి. ఈ క్రమంలో అతిక్రమణల ఆరోపణలు వినపడుతుంటాయి. ఇప్పుడు అవి తారస్థాయికి చేరి.. ఏకంగా యుద్ధ వాతావరణమే నెలకొంది.