మేకప్ లేకుండా సమంతని చూశారా.. ?
స్టార్ హీరోయిన్ అయినా మేకప్ లేకుండా చూడలేం. మేకప్ తీసేస్తే వారి కన్నా మన పక్కింటి అమ్మాయిలే బెటర్ అనుకొంటారు. ఇంకా చెప్పాలంటే మేకప్ లేకుండా తమ మొహాన్ని తామే చూసుకోలేరేమో హీరోయిన్స్. మేకప్ మొహాన్ని కప్పేయడం వారి అలవాటు అయిపోతుంది. ఆ మధ్య.. ధైర్యం చేసి మేకప్ లేకుండా కనిపించే ప్రయత్నం చేసింది స్టార్ హీరోయిన్ కాజల్.
మేకప్ లేకుండా కాజల్ ని చూడలేకపోయారు ఆమె అభిమానులు. కొందరు విమర్శలు కూడా చేశారు. మరికొందరు ఆమెని సపోర్ట్ చేశారు. ఇప్పుడు సమంత కూడా మేకప్ లేకుండా కనిపించే ప్రయత్నం చేసింది. కరోనా లాక్‌డౌన్ తో ఇంటికే పరిమితమైన సమంత.. పెద్దగా మేకప్ చేసుకోకుండానే ఫోటోకు పోజుచ్చింది. ఆ ఫోటోని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. అయితే మేకప్ లేకుండా కూడా సామ్ బాగానే ఉందిగా.. !
— Samantha Akkineni (@Samanthaprabhu2) May 28, 2020