తలసాని సాయం అందింది
కరోనా లాకడౌన్ తో షూటింగ్స్, థియేటర్స్ బంద్ అయ్యాయ్. దీంతో సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఆదుకొనేందుకు మెగాస్టార్ చిరంజీవి ముందుకొచ్చి సిసిసి సంస్థని ఏర్పాటు చేసి.. కొంత మేరకు సినీ కార్మికులని ఆదుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా సినీ కార్మికులని ఆదుకొనేందుకు ముందుకొచ్చారు. 14 వేల మంది సినీ కార్మికుల కోసం నిత్యవసర వస్తువులని రెడీ చేశారు.
వాటిని ఈరోజు మంత్రి తలసాని పంపిణీ చేశారు. కృష్ణానగర్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో 14 వేల మంది సినీ కార్మికులకి తలసాని ట్రస్ట్ నుండి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రంలో దిల్ రాజు, నాగార్జున, రాధాకృష్ణ, త్రివిక్రమ్ తదితరులు పాల్గొన్నారు. నిత్యవసర వస్తువులు అందుకున్న సినీ కార్మికులు మంత్రి తలసాని సాయం అందిందని చెబుతున్నారు. ఆయనకి కృతజ్ఝతలు చెబుతున్నారు. ఇక షూటింగ్ లకి ప్రభుత్వ అనుమతిని ఇప్పించేందుకు మంత్రి తలసాని చేసిన ప్రయత్నాలు ఫలించాయి. జూన్ నుంచి షూటింగ్స్ చేసుకోవచ్చని సీఎం కేసీఆర్ అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే.