అభివృద్దిలో తెలంగాణ నెం.1

దేశంలోనే అభివృద్ధిలో తెలంగాణ నెం.1 అన్నారు మంత్రి శ్రీనివాస్ ‌గౌడ్. సీఎం కేసీఆర్ నియంత్రిత వ్యవసాయ విధానాన్ని తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు మంత్రులు. నింయంత్రిత సాగు చేయాలి. రైతులు లాభపడాలి. అదే ప్రభుత్వ లక్ష్యం అంటున్నారు. మంత్రి  శ్రీనివాస్ ‌గౌడ్ కూడా ఇదే అన్నారు.

డిమాండ్‌ ఉన్న పంటలను సాగుచేస్తే మంచి లాభాలు వస్తాయన్నారు. ప్రభుత్వం సూచించిన పంటలను సాగుచేస్తే ప్రభుత్వం రైతువద్దకే వెళ్లి పంటను కొనుగోలు చేస్తుందన్నారు. నూతన సాగు విధానంపై రైతుబంధు కమిటీ సభ్యులు, పీఏసీసీఎస్‌ చైర్మన్లు, డైరెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకోవాలని మంత్రి సూచించారు. అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచిందన్నారు. నూతన వ్యవసాయ విధానానికి కట్టుబడి ఉంటామని పాలమూరు రైతులతో మంత్రి కూడా ప్రతిజ్ఞ చేయించారు.