కొండపోచమ్మను దర్శించుకున్న కేసీఆర్ దంపతులు

తెలంగాణలో కొండంత సంబరం జరుగుతోంది. మరికొద్ది సేపట్లో కొండపోచమ్మ జలాశయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించబోతున్నారు. ఈ ఉదయం తీగుల్ నర్సాపూర్ చేరుకున్న సీఎం కేసీఆర్ దంపతులు.. కొండపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చండీ హోమం, పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
కాళేశ్వరం ప్రాజెక్టులో అతి ఎత్తయిన ప్రాంతం ఇదే. సముద్రమట్టానికి 618 మీటర్ల ఎత్తులో ఉంది. మేడిగడ్డ నుంచి వచ్చే జలాలు దాదాపు అర కిలోమీటరు (518 మీటర్లు) మేర పైకి వచ్చి కొండపోచమ్మ జలాశయంలోకి చేరనున్నాయి. ఈ జలాశయం ద్వారా సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి జిల్లాల్లోని 2.85 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుంది. త్రిదండి చినజీయర్ స్వామితో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ జలాశయాన్ని ఉదయం 11.30 గంటల సమయంలో ప్రారంభించనున్నారు