లాంగ్ టైమ్ లాక్‌డౌన్ సాధ్యం కాదు : క్రేజీవాల్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విషయంలో చేతులెత్తేస్తున్నాయ్. ఓ వైపు కరోనా కేసులు భారీగా పెరుగుతుంటే.. మరోవైపు లాక్‌డౌన్ సడలింపుల పేరిట అన్నింటికి అనుమతులు ఇస్తున్నారు. అన్నింటిని తెరుస్తున్నారు. ఇలాగైతే ఎలా ? కరోనా కేసులు పెరుగుతున్నాయ్ కదా అంటే.. ? తప్పదు. కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలి. లాక్‌డౌన్ తో కరోనాని కంట్రోల్ చేయలేమని చెబుతున్నారు. ఢిల్లీ సీఎం క్రేజీవాల్ కూడా ఇదే అన్నారు.
సుదీర్ఘకాలం లాక్‌డౌన్ కొనసాగించడం సాధ్యం కాదన్నారు క్రేజీవాల్. అయితే కరోనాని ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నాం. భయపడాల్సిన పనిలేదన్నారు. తగినన్ని జాగ్రత్తలు తీసుకుకొని ప్రజలు ముందుకు సాగాల్సిందేనన్నారు. ఇప్పటికే కరోనా మహమ్మారి పట్ల ప్రజల్లో అవగాహన వచ్చింది. తగు జాగ్రత్తలు తీసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ.. కరోనాని దరి చేరకుండా చూసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి.