రుతుపవనాలు వచ్చేశాయోచ్.. !
వేసవిలో చల్లని కబురు అందింది. రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. ఈ విషయాన్ని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ తెలిపింది. జూన్ 1న రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) అంచనా వేసిన సంగతి తెలిసిందే. అయితే అంతకంటే రెండ్రోజుల ముందుగానే రుతుపవనాలు కేరళకు చేరుకోవడం విశేషం.
సాధారణం జూన్ 1న రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయి. అయితే గత యేడాది 8రోజుల ఆలస్యంగా అంటే జూన్ 1 న కేరళ తీరాన్ని తాకాయి. ఈ యేడాది మాత్రం రెండ్రోజుల ముందే చల్లని కబురు అందడం సంతోషించాల్సిన విషయం. దీంతో మండే ఎండల నుంచి ప్రజలకి ఉపశమనం కలుగనుంది.