పంట కొనుగోలు గడువు పెంపు

లాక్‌డౌన్ టైమ్ లో రైతులకి ఎలాంటి కష్టం కలుగకుండా జాగ్రత్తపడింది తెలంగాణ ప్రభుత్వం. పండిన పంటని మొత్తం కొనుగోలు చేస్తాం. ఆఖరి గింజవరకు కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ మాటిచ్చారు. మాటిచ్చినట్టుగానే ప్రతిగింజని కొంటున్నారు. అన్నిరకాల పంటలని ప్రభుత్వం కొనడం కూడా ఓ రికార్డు. ఒకట్రెండు గ్రామాలకి కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేసి.. మరీ ధాన్యాన్ని కొనుగోలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నెలాఖరి వరకు (మే 31) వరకు పంట కొనుగోలు చేస్తామని ప్రభుత్వం తెలిపింది.

ఇప్పుడీ గడువుని ప్రభుత్వం జూన్ 8 వరకు పొడిగించింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో జూన్‌ 8 వరకు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. వర్షాలు రాకముందే రైతులు తమ పంటను కేంద్రాలకు తరలించాలని సీఎం కోరారు. ఇక త్వరలోనే రైతులకి ప్రభుత్వం తీపి కబురు చెబుతోంది. అది దేశానికి సప్రైజ్ ఇచ్చేలా ఉంటుందని.. సీఎం తెలంగాణ రైతులని సస్పెన్స్ లో పెట్టేశారు. ఇప్పుడు తెలంగాణ రైతులంతా సీఎం కేసీఆర్ చెప్పబోయే తీపికబురు కోసం ఎదురు చూస్తున్నారు.