ట్రంప్ అన్నంత పని చేశాడు
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనిచేశాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నుంచి పూర్తి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. కరోనా విషయంలో ఆ సంస్థతో పాటు చైనా కూడా తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించి, ప్రపంచ వ్యాప్తంగా అపార ప్రాణ, ఆర్థిక నష్టాలకు కారణమయ్యాయని ట్రంప్ ఆరోపించారు.
ముందు నుంచి హెచ్చరిస్తున్నట్టుగా చైనాపై కఠిన ఆంక్షలు విధించారు. అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజీలో నమోదై, తమ దేశ చట్టాలను గౌరవించని చైనా కంపెనీలపైనా చర్యలు తీసుకుంటామని ట్రంప్ వెల్లడించారు. ఈ మేరకు తమ దేశ భద్రతకు ముప్పుగా పరిణమించే చైనాపౌరులను ఇకపై అమెరికాలోకి అనుమతించబోమని తేల్చి చెప్పారు. అలాగే అమెరికాలో చైనా పెట్టుబడుల విషయంలోనూ నిబంధనల్ని కఠినతరం చేస్తామని ప్రకటించారు.