14 మిలియన్ ఫాలోయింగ్.. రకుల్ హ్యాపీ !


స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇన్ స్టా గ్రామ్ ఫాలో వర్స్ సంఖ్య 14 మిలియన్స్ కి చేరింది. దీనిపై ఆమె ఆనందాన్ని వ్యక్తి చేసింది. హ్యాపీ మూడులోని ఫోటోలని రకుల్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఇప్పుడీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

టాలీవుడ్ లో అతి తక్కువకాలంలో రకుల్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. టాలీవుడ్ స్టార్ హీరోలందరితోనూ ఆడిపాడింది. అయితే ప్రస్తుతం రకుల్ కి తెలుగులో అవకాశాలు తగ్గాయ్. కోలీవుడ్, బాలీవుడ్ లో మాత్రం ఆమెకి వరుసగా ఆఫర్లు వస్తున్నాయ్. ప్రస్తుతం రకుల్ ఇండియన్ 2 సినిమాలో నటిస్తున్నారు. ఒకట్రెండు బాలీవుడ్ సినిమాలు కూడా ఆమె చేతిలో ఉన్నాయి.