సర్కారు వారి పాట.. మహేష్ ఫస్ట్ లుక్ !

సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడుగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాపై అధికారిక ప్రకటన వచ్చేసింది. సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే కానుకగా టైటిల్ పోస్టర్ ని విడుదల చేశారు. ‘సర్కారు వారి పాట’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. మహేష్ ఫస్ట్ లుక్ ని కూడా వదిలారు. పూర్తి లుక్ కాకుండా.. సైడ్ లుక్ లో మహేష్ ని చూపించారు. ఆయన మెడభాగంలో రూపాయి టాటూ కనిపించింది. వెనకలా పొడవాటి జుట్టుతో.. గడ్డెం లుక్ లో కనిపించారు మహేష్.

ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించనున్నారు. మైత్రీ మూవీస్, జీఎంబీ, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. హీరోయిన్ ఎవరు ? ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉన్నారు. కరోనా ప్రభావంతో షూటింగ్స్ బంద్ అయిన సంగతి తెలిసిందే. తిరిగి ప్రభుత్వం షూటింగ్ లకి అనుమతులు ఇవ్వగానే సర్కారు వారి పాట రెగ్యూలర్ షూటింగ్ మొదలు కానుంది. మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన మహెష్.. సర్కారు వాటి పాటతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టాలనే ఆశతో ఉన్నారు.