బెజవాడలో గ్యాంగ్ వార్ : కత్తులతో 30 మంది యువకుల దాడి
బెజవాడలో రెండు వర్గాలు రెచ్చిపోయాయ్. పట్టపగలే కత్తులతో స్వైర విహారం చేసుకున్నారు. దాదాపు 30 మంది.. చేతికి అందిన కర్రలు, రాళ్లతో ఒకరిపై ఒకరు విచ్చలవిడి దాడులు చేసుకున్నారు. కొందరికి తలలు పగిలాయి. మరికొందరికి మెడ, ముఖం, చేతులపై గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వర్గ నాయకుడు ప్రాణాలొదిలారు.
ఓ అపార్ట్ మెంట్ విషయమై జరిగిన సెటిల్ మెంట్ ఇందుకు కారణమని తెలిసింది. తాడిగడప డొంక రోడ్డులో ఉండే సందీప్ ఇనుప సామగ్రి వ్యాపారి. కోడూరి మణికంఠ అలియాస్ కేటీఎం పండు సనత్ నగర్ వాసి. వీరిద్దరు పెనమలూరు పరిధిలోని రూ.2 కోట్ల విలువైన అపార్ట్ మెంట్ సెటిల్ మెంట్ లో కలుగజేసుకున్నారు. ఈ క్రమంలో గొడవలయ్యాయి. అవి కాస్త గ్యాంగ్ వార్ కి దారితీశాయి. బెజవాడ గ్యాంగ్ వార్ ఎలా ఉంటుంది ? అన్నది ఈ తరానికి చూపించిన ఘటన ఇది.