మేనల్లుడుపై మహేష్ ప్రశంసలు

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. అశోక్ జంటగా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఆదివారం (మే 31) సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు కానుకగా అశోక్ గల్లా ఎంట్రీ ఇచ్చేశారు. కృష్ణ సాంగ్ ను తన సినిమాలో రీమిక్స్ చేసాడు. యమలీల సినిమా కృష్ణ డ్యాన్స్ తో అదరగొట్టిన ‘జుంబారే జూజుంబారే..’ అనే పాటను ఈ సినిమాలో రీమిక్స్ చేశారు.

ఇందుకు సంబందించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో అటు తాత కృష్ణ, ఇటు మేనమామ మహేష్ ని అచ్చుగుద్దినట్టు దించేశాడు అశోక్. మేనల్లుడు ఫర్ ఫామెన్స్ పై ప్రిన్స్ మహేశ్ ఫిదా అయిపోయాడు. ”ఈ సాంగ్‌లో ఉన్న ఎనర్జీలో నువ్వు జీవించేశావు అశోక్. నీ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. నీ నటనను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎదురుచూస్తున్నాను. నీకు, చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాక్ ఆన్” అని మహేష్ తన ట్వీట్ చేశారు.