పూరికి మహేష్ గ్రీన్ సిగ్నల్

ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసే కాంబోలలో ‘మహేష్-పూరి జగన్నాథ్’ కాంబో ఒకటి. వీరి కలయికలో వచ్చిన పోకిరి, బిజినెస్ మేన్ సూపర్ హిట్ అయ్యాయ్. ‘పోకిరి’ అయితే ట్రెండ్ సెట్ చేసింది. ఇండస్ట్రీ రికార్డులని కొల్లగొట్టింది. వీరి కాంబోలో హ్యాట్రిక్ సినిమాగా ‘జనగనమన’ సినిమాపై ప్రకటన వచ్చింది. కానీ కొన్ని కారణాల వలన ఆగిపోయింది. అంతేకాదు.. ఒకట్రెండు సందర్భాల్లో మహేష్ పై పూరి అసంతృప్తిగా ఉన్నట్టు మాట్లాడారు. దీంతో  ఇక వీరి కాంబోలో మరో సినిమా రావడం కష్టమే అనుకున్నారు.

అయితే ఈ గ్యాప్ ని తొలగించేశారు మహేష్. పూరితో సినిమా రెడీ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఆదివారం (మే 31) సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా మహేష్ ఇన్ స్టా వేదికగా నెటిజన్స్ ముచ్చటించారు. పూరితో సినిమా చేస్తారా ? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు.. మహేష్ కచ్చితగా చేస్తాను. నాకు ఇష్టమైన దర్శకుల్లో ఆయన ఒకరు. ఆయన వచ్చి కథ చెబుతారని ఇప్పటికీ వేచి చూస్తునన్నారు. సో.. పూరిదే లేటు.. మహేష్ రెడీ. భవిష్యత్ లో వీరి కాంబో సినిమా ఉండబోతుందన్న న్యూస్ అభిమానులని సంతోష పెడుతోంది.