మహేష్ ముద్దు పేరేంటో తెలుసా ?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ వయసులోనూ ముద్దొచ్చేలా ఉంటాడు. మరీ.. ఆయన ముద్దు పేరేంటో తెలుసా ? నాని. అవునూ.. నాని. మహేష్ హీరోగా ‘నాని’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. మహేష్ పెంపుడు కుక్కుల పేరేంటో తెలుసా ? నోబితా, ప్లూటో. ఇద్దరు పిల్లలు గౌతమ్, సితారలలో మహేష్ కు ఎవరంటే ఎక్కువ ఇష్టం ? అంటే.. ఇద్దరు ఇష్టమే. రెండు కళ్లు లెక్క.

హీరోయిన్స్ సమంత, రష్మిక లలో మహేష్ కు ఎవరు ఇష్టం ? అంటే.. వాళ్లిద్దరు అద్భుతమైన సహనటులు. వాళ్లిద్దరినీ మహేష్ బాగా ఇష్టపడతాడు. ఇవన్నీ ఎలా తెలిశాయ్ అంటే.. ? స్వయంగా మహేశ్ నే చెప్పాడు. ఆదివారం (మే 31) సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా మహేష్  ఇన్ స్టా వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పై ప్రశ్నలకి సమాధానం ఇచ్చారు