‘సర్కారు వారి పాట’ ఇలా ఉండబోతుంది !

సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకుడు. ఆదివారం (మే 31) సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు కానుకగా ‘సర్కార్ వారి పాట’ టైటిల్ పోస్టర్ ని విడుదల చేశారు. దీంతో పాటు మహేష్ సైడ్ లుక్ ని చూపించారు. మహేష్ మాస్ లుక్ అదిరిపోయింది. అయితే ‘సర్కారు వారి పాట’ ఎలా ఉండబోతుంది ? అనే చర్చ అభిమానుల్లో మొదలైంది.

దీనిపై మహేష్ క్లారిటీ ఇచ్చారు. ఆదివారం తన తండ్రి, ప్రముఖ నటుడు కృష్ణ పుట్టినరోజుని పురస్కరించుకుని ఇన్ స్టగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చటించారు మహేష్. ఈ సందర్భంగా ‘సర్కారు వాటి పాట’ ఎలా ఉండబోతుందని ఓ నెటిజన్ అడిన ప్రశ్నకు మహేష్ సమాధానం ఇచ్చారు. ‘ఒక బలమైన సందేశంతో కూడిన మంచి ఎంటర్ టైనర్. దీని గురించి చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నానన్నారు మహేష్.

ఇక ‘సర్కారు వారి పాట’లో మహేష్ కి జంటగా నటించే హీరోయిన్ ఎవరు ? ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉన్నాయి. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీస్, జీఎంబీ, 14రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.