ఉత్తమ్ ‘వర్సెస్’ జగదీశ్వర్ రెడ్డి.. గట్టిగానే అనుకొన్నారు !
మంత్రి జగదీశ్వర్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎదురుపడ్డారు. మాటలతో కలబడ్డారు. నువ్వెంత అంటే.. నువ్వెంత? అనుకొన్నారు. ఆదివారం నియంత్రిత పంటల సాగు కార్యాచరణ ప్రణాళికపై నల్గొండలో జరిగిన సదస్సు రాజకీయ విమర్శలకు వేదికైంది.
మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రూ. 17వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. అది అబద్దం అంటూ ఉత్తమ్ కలుగజేసుకొన్నారు.
ఈ క్రమంలో ఒకరిపై ఒకరు మాట మాట అనుకొన్నారు. మీడియా కోసం గిమ్మిక్కులు చేయొద్దని మంత్రి జగదీశ్వర్ రెడ్డి మండిపడ్డారు. దానిపై ఉత్తమ్ గట్టిగానే స్పందించారు. మీరే మీడియా ముందు షో చేస్తున్నారని విమర్శించారు. దీంతో.. నువ్వెంత… నీ లెక్కేంది ? అంటూ మంత్రి వాయిస్ పెంచారు. మీరు పీసీసీ చీఫ్ గా ఉండటం సొంత పార్టీ నేతలకే ఇష్టం లేదన్నారు.