నిహారిక.. చెప్పి మరీ చూపిస్తోంది !


మెగా హీరోయిన్ నిహారిక ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచేసింది. హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తోంది. అయితే గ్లామర్ డోస్ పెంచబోతున్నట్టు నిహారిక ముందే చెప్పడం విశేషం. ఆ మధ్య సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ ఛాట్ చేసిన నిహారికకి రొమాంటిక్ సినిమాల్లో నటిస్తారా ? ప్రశ్న ఎదురైంది. తప్పకుండా. త్వరలోనే హాట్ హాట్ ఫోటో షూట్స్ చేయబోతున్నా.
 
అంతేకాదు.. సినిమాల్లోనూ గ్లామర్ గా కనిపించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. చెప్పినట్టుగానే గత కొన్నాళ్లుగా నిహారిక గ్లామర్ డోస్ పెంచేసింది. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో రెచ్చిపోతోంది. లెటెస్ట్‌గా నిహారిక ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్ కోసం హాట్ ఫోటో షూట్‌లో పాల్గొంది. ఇందులో బ్యాక్ అందాలని ఆరబోసింది. కవ్వించే చూపులతో పిచ్చేకిస్తొంది. వీటిని చూసిన జనాలు మెగా హీరోయిన్ హాట్ గురూ.. అని కామెంట్ చేస్తున్నారు.