‘సర్కారు వారి పాట’ స్టోరీ లైన్ లీకు !

పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించనున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే (మే 31) కానుకగా ‘సర్కారు వారి పాట’ టైటిల్ పోస్టర్ ని వదిలారు. ఇందులో మహేష్ మాస్ లుక్ లో కనిపించారు. బలమైన మేసేజ్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ‘సర్కారు వారి పాట’ తెరకెక్కనుందని మహేష్ ఇప్పటికే చెప్పేశారు.

తాజాగా ఈ సినిమా కథ ఇదే అంటూ.. ఓ లైన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ కథనం ప్రకారం.. బ్యాంకింగ్ సెక్టార్ లో జరుగుతున్న మోసాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందట. బ్యాంక్ ఉద్యోగి కొడుకుగా మహేష్ కనిపిస్తాడట. ఆర్థిక సమస్యల కారణంగా తన కుంటుంబం ఎదుర్కొన్న ఇబ్బందులను మహేష్ ఎలా అధిగమించాడనే కథతో సర్కారు వారి పాట తెరకెక్కనుందని చెబుతున్నారు. ఇక ఈ సినిమా కోసం మహేష్ రెమ్యూనరేషన్ ఇంకా ఫిక్స్ కాలేదట. సినిమా రిలీజ్ సమయంలో పరిస్థితులని బట్టీ మహెష్ రెమ్యూనరేషన్ తీసుకుంటారని సమాచారమ్.