తెలంగాణలో డాక్టర్లని వణికిస్తున్న కరోనా

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు తెలంగాణలో 2,891 కరోనా కేసులు నమోదయ్యాయ్, మరో 92 మంది కరోనాతో మృతి చెందారు. మంగళవారం ఒక్కరోజే 99 కొత్త కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ లోనే కరోనా ప్రభావం అధికంగా ఉంది. వైద్యులు, సిబ్బంది కరోనా బారిన పడుతుండటం ఆందోలళన కలిగిస్తోంది.

నీమ్స్ ఆసుపత్రిలో 4గురు డాక్టర్లకి కరోనా సోకింది. లాబ్య్ లో పనిచేసే ముగ్గురికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఉస్మానియా మెడికల్ కాలేజీలు ఇప్పటివరకు 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయ్. కరోనా వారియర్స్ డాక్టర్లు, పోలీసులకి కూడా వైరస్ బారినపడుతుండటం బాధని కలిగిస్తోంది. అయితే వారికి తగిన సదుపాయాలు లేకపోవడం కూడా వైరస్ సోకడానికి కారణమవుతుందని విమర్శలొస్తున్నాయ్.