మహేష్ ఇష్టం కానీ.. ప్రభాస్ తో రొమాన్స్ చేస్తా !


బాహుబలి సినిమాతో తెలుగు సినిమా హద్దులు చెరిగిపోయాయ్. ఇప్పుడు టాలీవుడ్ నుంచి వరుసగా పాన్ ఇండియా సినిమాలు క్యూ కడుతున్నాయి. టాలీవుడ్ స్టార్స్ తో రొమాన్స్ చేసేందుకు బాలీవుడ్ హీరోయిన్స్ రెడీ అంటున్నారు. స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే తెలుగు సినిమా ఫిక్సయింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కనున్న చిత్రమిది. భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కి  జంటగా దీపికా పదుకొనెని తీసుకున్నారు. టాలీవుడ్ హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే దీపికకి ఇష్టం. గతంలో ఓ ఇంటర్వ్యూలో దీపిక ఈ విషయం చెప్పింది. దీంతో.. దీపిక తెలుగులోకి ఎంట్రీ ఇస్తే కచ్చితంగా మహేష్ సినిమాలో నటిస్తుందని భావించారు. కానీ, మహేష్ ఇష్టమైన చెప్పిన దీపిక ప్రభాస్ తో రొమాన్స్ చేయబోతుండటం విశేషం. మరీ.. మహేష్ కి దీపిక ఎప్పుడు ఛాన్స్ ఇస్తుందన్నది చూడాలి.