జగ్గారెడ్డి లాక్‌డౌన్ డిమాండ్లు
కరోనా లాక్‌డౌన్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. వారిని ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయ్. ఇందులో భాగంగా మార్చి, ఏప్రిల్, మే మూడు నెలలకి గానూ నెలకో రూ. 1500, 12కిలోల బియ్యాన్ని సరఫరా చేసింది. రెండు నెలల పాటు విద్యుత్ బిల్లులని నిలుపుదల చేసింది. కేంద్రం కూడా నెలకో రూ. 500 పేదల ఖాతాలో జమచేసింది. అయితే ఆ సాయం చాలాదు. పేదలకి తెలంగాణ ప్రభుత్వం మరిన్ని మినహాయింపులు ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరుతున్నారు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. ఆ లేఖలో పలు డిమాండ్స్ చేశారు. అవి నేర్చకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు.
జగ్గారెడ్డి చేసిన డిమాండ్స్ ఇలా ఉన్నాయ్. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇంటి పన్నును ఒక సంవత్సరం రద్దు చేయాలలి. కరెంటు బిల్లును 6నెలల వరకు ప్రభుత్వం రద్దు చేయాలి. మరో 6 నెలల పాటు ఈఎమ్‌ఐ ని ప్రభుత్వమే చెల్లించాలి. నీటి బిల్లులు ఒక సంవత్సరం వరకు ప్రభుత్వం వసూలు చేయొద్దు. పరిశ్రమల వద్ద కూడా ఆరు నెలల వరకు కరెంటు బిల్లులు రద్దు చేయాలి. ఈ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే ఈనెల 9వ తేదీన తన ఇంట్లో ఒక రోజు నిరాహార దీక్ష చేయనున్నట్లు జగ్గారెడ్డి పేర్కొన్నారు.