నియంత్రణతో రైతులకి అధిక లాభాలు
తెలంగాణలో నియంత్రిత విధానంలో పంటల సాగుకోసం సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో నియంత్రిత విధానంలో పంటల సాగు వ్యూహంపై మూడు రోజులు విస్తృతంగా చర్చించిన సీఎం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పత్తి పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించారు. పత్తి నాణ్యతకు సంబంధించి అన్నదాతలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
అమ్ముడయ్యే పంటలు వేయడం వల్ల వ్యవసాయం లాభసాటిగా మారుతుందని అభిప్రాయపడ్డారు. అన్నదాతలకు లాభం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకే ఈ ప్రయత్నమన్నారు. ప్రభుత్వ అధికారులు, రైతుల సహకారం ఉంటేనే ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేయగలమని కేసీఆర్ వివరించారు. ప్రజలు బలవర్థకమైన ఆహారం తీసుకోవడం లేదన్నారు. పోషకాహారం తినేలా ప్రజలను ప్రోత్సహించాలని.. అలాంటి పంటలు పండించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.