సమంత పాత్రలో రస్మిక

స్టార్ హీరోయిన్ సమంత పాత్రలో యంగ్ హీరోయిన్ రష్మిక మందనని చూడాలని ప్రేక్షకులు ఆశపడుతున్నారు. కరోనా లాక్‌డౌన్‌ తో ఇంటికే పరిమితమైన రస్మిక మంగళవారం ట్విటర్‌ వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా.. ‘భవిష్యత్తులో నన్ను ఎలాంటి పాత్రల్లో, సినిమాల్లో చూడాలని మీరు కోరుకుంటున్నారు.? మీ సమాధానాలు తెలుసుకోవాలని ఎంతో ఉత్సుకతగా ఉన్నాను. కాబట్టి త్వరగా సమాధానం తెలియజేయండి’ అని రష్మిక ట్వీట్‌ చేసింది.

ఆమె ట్వీట్‌ చూసిన నెటిజన్లు.. ‘మీరు మరోసారి లిల్లీ(డియర్‌ కామ్రేడ్‌) పాత్రలో నటిస్తే చూడాలని ఉంది’, ‘గీత (గీతగోవిందం) పాత్ర మీకు బాగా నప్పుతుంది’, ‘హారర్ చిత్రాల్లో నటించండి’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో సమంత పోషించిన పాత్ర లాంటి క్యూట్‌ రోల్‌ మీకు బాగుంటుంది. అలాంటివి చేయండి’ అని కామెంట్లు చేశారు. భవిష్యత్ తో సమంత బయోపిక్ తెరకెక్కిస్తే.. ఆ పాత్ర కోసం ఫస్ట్ ఛాన్స్ గా రస్మికని భావించాల్సి ఉంటుందేమో.. !