తండ్రి-కొడుకులు ఇరగదీశారు రాముల.. !!

‘అల.. వైకుంఠపురంలో’ని పాటలు ఖండాలు దాటిపోయాయ్. ప్రపంచాన్ని ఆకట్టుకొన్నాయ్. టన్నులకొద్ది రికార్డులని క్రియేట్ చేశాయ్. ఈ పాటకు ఎందరో ప్రముఖులు చిందులేశారు. అందరూ వేస్తున్నారు.. తానెందుకు వేయకూడదు అనుకున్నారు శేఖర్ మాస్టర్. రాములో రాముల పాటకి నృత్యాలు సమకూర్చిన శేఖర్ మాస్టర్ తనయుడు విన్నీతో కలిసి అదిరిపోయే స్టెప్పులేశాడు.

దీనికి సంబంధించిన వీడియోను ఆయన ‘ఇన్‌స్టా’ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తండ్రీకొడుకుల డ్యాన్స్‌ చూసిన నెటిజన్లు.. ‘వావ్‌, సూపర్‌, చాలా బాగుంది’ అని కామెంట్లు పెడుతున్నారు. శేఖర్ మాస్టర్ డ్యాన్స్ గురించి తెలిసిందే. ఆయన తనయుడు విన్నీ తండ్రితో ఏమాత్రం తగ్గకుండా స్టెప్పులేయడం ఆకట్టుకుంటోంది.