విదేశాల్లో ఐపీఎల్ ?
కరోనా ఎఫెక్ట్ తో ఐపీఎల్-13 సీజన్ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అక్టోబర్ లో ఈ టోర్నిని నిర్వహించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఒకవేళ స్వదేశంలో వీలుకాకుంటే విదేశాల్లో నిర్వహణపై బీసీసీ సమాలోచనలు జరుపుతోంది. కరోణా పరిస్థితి మరీ తీవ్రంగా మారితే భారత్ ఆవల లీగ్ నిర్వహించేందుకు బోర్డు ఆలోచిస్తోందని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు.
‘భారత్‌లో ఐపీఎల్ నిర్వహిస్తే ఆటగాళ్లకు ఎలాంటి ప్రమాదం లేకుంటే మా తొలి ప్రాధాన్యం స్వదేశమే. పరిస్థితులు అనుకూలించక నిర్వహణకు అవకాశం లేకుంటే చేసేదేమీ లేదు. ఒకవేళ విండో కుదిరితే భారత్ నుంచి తరలించేందుకు ఆలోచిస్తాం. గతంలో మనం దక్షిణాఫ్రికాలో నిర్వహించాం. విదేశాలకు తరలించడం ఇష్టమేం కాదు. పరిస్థితుల వల్ల ఆ ఒక్క అవకాశమే ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు’ అని ధమన్ అన్నారు. ఒకవేళ ఈ యేడాది ఐపీఎల్ రద్దయినట్టటే.. బీసీసీఐ రూ.4000 కోట్ల వరకు నష్టపోతుంది.