హీరో తమ్ముడు.. కూతురు వరుసయ్యే అమ్మాయిపై లైంగిక వేధింపులు !
బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తమ్ముడు చేసిన నీఛమైన పనికి అందరు అసహించుకుంటున్నారు. ఆయన వరుసకు కూతురయ్యే యువతిని లైంగిక వేధించాడు. తొమ్మిదేళ్ల వయసులో తనను లైంగిక వేధింపులకు గురి చేసినట్టు ఢిల్లీలోని జమీనా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. ఈ వ్యవహారంలో హీరో నవాజుద్దీన్, అతడి తండ్రిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయ్.
“రెండేళ్ల వయసులో మా అమ్మానాన్న విడిపోయారు. మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. తొమ్మిదేళ్ల వయసులో మా చిన్నాన్న (నవాజుద్దీన్ తమ్ముడు) నన్ను లైంగికంగా హింసించాడు. నేను నరకాన్ని అనుభవించారు. ఆ వయసులో లైంగిక వేధింపులనే విషయం అర్థం కాలేదు. పెరిగి పెద్దయ్యాక అతడి చేష్టలను గుర్తించాను. ఒక రోజు పెదనాన్న(నవాజుద్దీన్) నన్ను ‘నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు?’ అని అడిగారు. అప్పుడు నేను, నాపై జరిగిన లైంగిక వేధింపుల గురించి చెప్పాను. ఆయన మాత్రం అలా ఏం జరిగి ఉండదన్నారు. ‘అతను నీ చిన్నాన్న, అలా ఎప్పుడూ చేయడు’ అన్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.