తారక్ టైటిల్ ‘రేడియేషన్’

కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా ఫిక్సయిన సంగతి తెలిసిందే. తారక్ బర్త్ డే (మే 20) కానుకగా ఈ సినిమాపై అధికారిక ప్రకటన చేశారు ప్రశాంత్ నీల్. ఇక ఈరోజు ప్రశాంత్ నీల్ బర్త్ డే కానుకగా టైటిల్ ని రివీల్ చేసింది మైత్రీ మూవీస్. ప్రశాంత్ నీల్ బర్త్ డే అభినందనల్లో భాగంగా.. త్వరలో రేడియేషన్ సూట్ లో కలుసుకుందాం అని చెప్పారు. దానికి ప్రశాంత్ నీల్ కూడా ఓకే అన్నారు. దీంతో తారక్-ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్ ‘రేడియేషన్’ అని తెలిసిపోయినట్టయింది.

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 తో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత కూడా కేజీఎఫ్ నిర్మాతలకి మరో సినిమా చేయాల్సి ఉంది. అది చాలా చిన్ని సినిమా అని చెబుతున్నారు. ఆ తర్వాత తారక్ తో సినిమా ఉండనుంది. ఈలోగా ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు త్రివిక్రమ్ సినిమాని పూర్తి చేయనున్నారు తారక్. ‘రేడియేషన్’ టైటిల్ అదిరిపోయింది. హీరోయిజాన్ని హైలైట్ చేసేలా ఉందని నందమూరి అభిమానులు సంతోషపడుతున్నారు.