యువీపై పోలీస్ కేసు

టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై హరియాణలో పోలీస్ కేసు నమోదైంది. కరోనా లాక్‌డౌన్ తో ఆటగాళ్లంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ ఖాళీ సమయాల్లో ఆటగాళ్లు వీడియో కాన్పరెన్స్ లో ముచ్చటించుకున్నారు. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రెండ్రోజుల క్రితం రోహిత్‌ శర్మ, యువరాజ్‌ సింగ్‌ ఇన్‌స్టా లైవ్‌లో మాట్లాడుకున్నారు.

ఈ క్రమంలో మణికట్టు మాంత్రికులు యుజువేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌పై చర్చించారు. వారి గురించి మాట్లాడుతూ యువీ ‘భాంగి’ అనే పదం ఉపయోగించాడు. అందుకు రోహిత్‌ శర్మ సైతం నవ్వాడు. ఇది ట్విటర్లో వివాదంగా మారింది. యువీ దళితులకు వ్యతిరేకంగా మాట్లాడాడని ట్రోలింగ్‌ జరిగింది. యువరాజ్‌పై హరియాణాలోని దళిత హక్కుల నేత, న్యాయవాది రజత్‌ కలశన్‌ హిస్సార్‌లోని హన్సిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువీ ఉపయోగించిన పదం దళితుల సెంటిమెంట్‌ను గాయపరిచిందన్నారు.