విరాటపర్వం : ప్రియమణి ఫస్ట్ లుక్
హీరోయిన్ ప్రియమణి నక్సలైట్ గా మారింది. చేతిలో తుపాకి పట్టి పోరుకు సిద్ధమైంది. భారతక్కగా దళాన్ని నడిపిస్తోంది. వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా-సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. మావోయిస్టు బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ప్రియమణి నక్సలైట్ భారతక్కగా నటిస్తున్నారు. గురువారం ప్రియమణి బర్త్ డే కానుకగా ‘విరాటపర్వం’లోని ఆమె లుక్ ని విడుదల చేశారు. భారతక్క పాత్రపై రానా దగ్గుపాటి కొత్త వివరణ కూడా ఇచ్చారు.
“మహా సంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని ఆమె నమ్మింది. ఫ్రెంచి విప్లవంలో విద్యార్థుల పాత్ర ఎంత కీలకమో ‘విరాటపర్వం’లో కామ్రేడ్ భారత్క కూడా అంతే కీలకం’ అని రానా చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి విరాటపర్వంలో ప్రియమణి పాత్ర ఎంత కీలకమో అర్థమతోంది. కరోనా లాక్డౌన్ తో విరాటపర్వం షూటింగ్ ఆగిపోయింది. దాదాపు షూటింగ్ పూర్తయిన ఈ సినిమాలో కొన్ని సీన్స్ మాత్రమే చిత్రీకరించాల్సి ఉన్నాయని తెలుస్తోంది.