మ‌రో చిన్న సినిమా ఓటీటీ రిలీజ్

కరోనా లాక్‌డౌన్ తో షూటింగ్స్, థియేటర్స్ బంద్ అయ్యాయ్. త్వరలోనే షూటింగ్స్ ని అనుమతులు లభించనున్నాయి. అయితే,  థియేట‌ర్లు తెర‌వ‌డం గురించి ఇప్పుడు ప్ర‌భుత్వాలు కూడా ఆలోచించ‌డం లేదు. క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. దీంతో థియేట‌ర్లు తెర‌వ‌డం ఎప్పుడ‌నేది స‌మాధానం లేని ప్ర‌శ్న‌లానే ఉంది.

ఈ నేప‌థ్యంలో ఏప్రిల్, మే నెలలో రిలీజ్ కావాల్సిన సినిమాలకి డిజిటల్ స్ట్రీమింగ్ ఒక్కటే ఆప్షన్ గా మారింది. ఈ క్రమంలో తెలుగు నుంచి మరో చిన్ని సినిమా ఓటీటీ రిలీజ్ కాబోతున్నట్టు తెలుస్తోంది.  దర్శకుడు వెంక‌టేష్ మ‌హా తొలి సినిమా ‘కేరాఫ్ కంచ‌ర‌పాలెం’ తో దేశం దృష్టిని ఆక‌ర్షించారు. ఆయన దర్శకత్వంలో వస్తున్న రెండో సినిమా ‘ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌శ్య’.  ‘మ‌హేశింటే ప్ర‌తీకారం’ అనే మ‌ల‌యాళ సినిమాకు రీమేక్ ఇది.

ఏప్రిల్ 17న విడుదల కావాల్సిన  ‘ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌శ్య’ ఓటీటీ రిలీజ్ పై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలో సందడి చేయనుంది తెలిసింది. చిన్ని సినిమాలే కాదు.. పలు మీడియం బడ్జెట్ సినిమాలు ఓటీటీ రిలీజ్ పై సమాలోచనలు జరుగుతున్నాయి.